టాలీవుడ్ సినీ పరిశ్రమకి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఒక షరతును విధించారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా మూవీ రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల ధరల పెంపు, థియేటర్లకి సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వం వద్దకు వచ్చేవారికి ఈ షరతు వర్తిస్తుందని ఆయన తెలియచేసారు . తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల వంటి అంశాలపై ప్రజలకి అవగహన తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. సామాజిక బాధ్యతగా దీనిని తీసుకోవాలని ఆయన తెలిపారు . ఒక మూవీ పర్మిషన్, టికెట్ రేట్ల పెంపుల అనుమతి కోసం వచ్చే వారు, తమ మూవీ లోని స్టార్స్ తో ఒక సోషల్ అవేర్నెస్ వీడియో తీసి ప్రభుత్వానికి అందించాల్సిందేనని రేవంత్ ఒక కండీషన్ పెట్టారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అవేర్నెస్ వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించారని.. ఈ సందర్భంగా ఆయనకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోలు ఎక్కువగా రావాలని ఆయన సూచించారు.