తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఇప్పటికే అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదు. ఫీల్డ్ విజిట్‌లు చేయాలని పదే పదే చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారు? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏసీ అనేది జబ్బేమో! అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇకపై కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.