జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, హోం మంత్రి సుచరిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
ఇప్పటికే 26 జిల్లాలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ నెల 26 వరకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై సీఎం సమీక్ష చేపట్టారు.