తమ్ముడి కోసం అలీ సాహసం

Comedian Ali For His Brother Khayyum Movie Offers

సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలా కామన్‌. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ వారసులను తీసుకు వచ్చారు. తాజాగా కూడా పలువురు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక కమెడియన్‌ అలీ తన తమ్ముడు ఖయ్యూం ఖాన్‌ను చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడు. అలీ కమెడియన్‌గా స్టార్‌ ఇమేజ్‌ను కలిగి ఉన్న సమయంలోనే ఖయ్యూం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాని ఖయ్యూంకు అంతగా గుర్తింపు రాలేదు. దాంతో తమ్ముడికి ఛాన్స్‌లు ఇప్పించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా కూడా తమ్ముడు కోసం అలీ ఏకంగా నిర్మాత అవతారం ఎత్తాడు.

Khayyam desam lo dongalu paddaru

ఇప్పటి వరకు కమెడియన్‌గా నటించిన ఖయ్యూం ఖాన్‌ మొదటి సారి సోలో హీరోగా ఒక చిత్రంను చేశాడు. ‘దేశంలో దొంగలు పడ్డారు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంకు అలీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రంను అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు కమెడియన్‌గానే అరించలేక పోయిన ఖయ్యూం ఖాన్‌ ఈ చిత్రంతో హీరోగా మెప్పిస్తాడా అనేది చూడాలి. తమ్ముడిని హీరోగా పెట్టి సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం అలీకి ఏ మేరకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.