సునీల్‌కు సరైన రీ ఎంట్రీ దక్కలేదు…!

Sunil Re Entry As Comedian

కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకునేందుకు చాలా కష్టపడ్డ సునీల్‌ టాలీవుడ్‌లోనే టాప్‌ కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. కమెడియన్‌గా మంచి జోష్‌ మీదున్న సమయంలో హీరోగా ఛాన్స్‌లు దక్కడంతో సునీల్‌ హీరోగా మారిపోయాడు. అందాల రాముడు చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న సునీల్‌ ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేశాడు. కొన్నాళ్ల పాటు హీరోగా మెప్పించిన సునీల్‌ ఆ తర్వాత ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా మెప్పించలేదు. దాంతో మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

sunil

సునీల్‌ కమెడియన్‌గా ‘సీల్లీ ఫెలోస్‌’, ‘అరవింద సమేత’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా సిల్లీ ఫెలోస్‌ చిత్రం విడుదల అయ్యింది. అల్లరి నరేష్‌ నటించిన ఆచిత్రం దారుణమైన టాక్‌ను దక్కించుకుంది. ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఆ చిత్రం ఉంది. దాంతో సునీల్‌కు కమెడియన్‌గా సరైన రీ ఎంట్రీ దక్కలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ సునీల్‌ను సరిగా వాడుకోలేక పోయాడు అంటూ మరికొందరు అంటున్నారు. సునీల్‌ కమెడియన్‌గా అరవింద సమేత చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ చిత్రంతో అయినా సునీల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

sunil-movies-camedian