ఏడాదిన్నర తరువాత పవన్‌ని కలిశా

ఏడాదిన్నర తరువాత పవన్‌ని కలిశా

దాదాపు ఏడాదిన్నర తరువాత పవన్ కళ్యాణ్‌ని కలిశా. మధ్యలో కలుద్దాం అని ట్రై చేశా.. కానీ ఆయన లేరు. పూణెలో ఉన్నారని తెలిసింది. రీసెంట్‌గా ఆయన్ని పెళ్లిలో కలిశా. ఇండస్ట్రీలో ఇలాంటి మామూలే.. మేమంతా బాగానే ఉంటాం.. బయట జనాలు కావాలని రచ్చ చేస్తుంటారు తప్పితే.. మాలో ఎలాంటి విభేదాలు ఉండవు. 2021లో పవన్-అలీ కలిసి సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. డెఫనేట్‌‌గా కలిసి సినిమా చేస్తాం..

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయగానే.. అలీ ఆ పార్టీలో చేరతారని అందరూ భావించారు. కానీ, అలీ అందుకు విరుద్ధంగా వైసీపీలో చేరి పవన్ సహా అందరికీ షాకిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో భాగంగా అలీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని.. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరపున టిక్కెట్‌ ఇచ్చినా.. తనను వదిలి వెళ్లారని, మోసం చేశాడని అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని.. తనతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇప్పుడు చెప్పా పెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయారని.. వెళ్లింది కాక.. తాను ఎన్నికల్లో రాణించలేనని ఆయన ఎలా అనుకుంటారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

అయితే ఆ తరవాత అలీ కూడా కౌంటర్ ఇచ్చారు.. తాను స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాను తప్ప ఎవరో తీసుకువస్తే రాలేదని అన్నారు అలీ. పవన్ కల్యాణ్ నాకు సాయం చేశారా? ఇంట్లో ఖాళీగా వుంటే ఆయన నాకు అవకాశాలు ఇప్పించారా? డబ్బులు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే తాను మంచి పొజిషన్లో ఉన్నానని అలీ గుర్తు చేశారు.

తాను వైసీపీలోకి చేరడం న్యాయం కాదని, వైసీపీలోకి తాను వెళ్లకూడదని రాజ్యాంగంలో రాసి లేదని అలీ అప్పట్లో కౌంటరిచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మొత్తం మీడియానే చేసింది మేమంతా బాగానే ఉన్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలీ.