కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా కన్నుమూశారు. మాజీ ఎంపీ పని చేసిన గురుదాస్ దాస్ గుప్తా కొద్ది రోజులుగా గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతు కోల్‌కతాలో మరణించారు. ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, సీపిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సీపీఐ జాతీయ సెక్రటేరియెట్ సభ్యుడిగా ఎన్నికై ఎంపీగానూ పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడారు.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా కూడా పని చేస్తు దానికి సంబంధించిన క్యాబినెట్ సెక్రెటరీ నోట్‌ను వెల్లడించారు. క్యాబినెట్ సెక్రెటరీ స్పెక్ట్రమ్ ధర పెంచాలని ప్రధానికి లేఖ రాసినపుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి కుంభకోణం గురించి తెలియదని చెప్పడం సరికాదని ముక్కుసూటిగా చెప్పేశారు.
గురుదాస్ గుప్తాకు భార్య, కుమార్తె ఉన్నారు. కలకత్తా యూనివర్శటీలో ఎంకామ్ పూర్తి చేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ట ఆసక్తి పెంచుకుని ప్రజా ప్రతినిధిగా ఉన్నా కూడా గురుదాస్ గుప్తా చాలా సాధారణ వ్యక్తిగానే ఉండేవారు. తొలిసారిగా రాజ్యసభకు 1985లో ఎన్నికై తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని పన్‌స్కూరా పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికయ్యారు. రెండోసారి కూడా ఘటల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.