జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో అళమెత్తినప్పటి నుంచి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ నేతలు పవన్ పై తమ విమర్శల మోతాదును కాస్త ఎక్కువ చేసారు.అలా కొంతమంది అయితే అయితే పవన్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తున్నారు.అలా చేస్తున్న వారిలో మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా ఒకరు.ఆయన ఇప్పుడు పవన్ పై మరోసారి తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తూ రెచ్చిపోయారు.పవన్ పక్కాగా చంద్రబాబు బినామీయే అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.
గతంలో చంద్రబాబు హయాంలో ఎవరన్న బలవంతంగా భూములు లాక్కుంటే తాను అండగా ఉంటానని చెప్పిన మరు రోజే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చెయ్యడం మొదలు పెట్టినపుడు పవన్ ఎక్కడికి పోయారని అలాగే తన మంగళగిరి మరియు ఇతర కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు జనసేన పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను నిలబెట్టలేదని సరే ఇది వదిలేసినా తన జనసేన అభ్యర్థుల కొంతమంది నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారానికి వెళ్లలేదని ప్రశ్నించారు.ఈ విధంగా పవన్ ముమ్మాటికీ చంద్రబాబు బినామీయే అని అంటున్నారు.