లక్ష్మీస్ ఎన్టీఆర్ ,లక్ష్మీస్ వీరగ్రంధం మధ్య రాజీ ఒప్పందం ?

compromise-between-lakshmis-ntr-and-lakshmis-veeragrandham
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏమైందో ఏమో …ఎన్టీఆర్ జీవిత చరిత్ర చుట్టూ అల్లుకున్న కథలతో మూడు సినిమాలు మూడు కోణాల్లో వస్తాయి అనుకుంటే సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క సినిమా మాత్రమే పైప్ లైన్ లో కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో చేస్తున్న ఎన్టీఆర్ సినిమా మినహా మిగిలిన రెండు సినిమాల ఊసు వినపడకుండా పోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎన్టీఆర్ జీవితాన్ని లక్ష్మీపార్వతి కోణం నుంచి చూపిస్తా అని అప్పట్లో ప్రకటించిన వర్మ ఇప్పుడు ఆ మాటే గుర్తు లేనట్టు సైలెంట్ అయిపోయారు. ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ కి పోటీగా చెన్నై నుంచి వచ్చిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి “ లక్ష్మీస్ వీరగ్రంధం “ తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇందులో ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోక ముందు లక్ష్మీపార్వతి జీవిత ఘట్టాల్ని కూడా టచ్ చేస్తానని కేతిరెడ్డి ప్రకటించడంతో నానా రచ్చ జరిగింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ , లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా చేస్తున్న వాళ్ళు టీవీ ఛానెల్స్ సాక్షిగా మాటలు యుద్ధాలు చేసుకున్నారు. ఇక కేతిరెడ్డిని లక్ష్మీపార్వతి తెగ తిట్టిపోస్తే, ఆమె తో అనుబంధం వున్న ఊళ్ళన్నీ తిరిగి కేతిరెడ్డి కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమాల్లో ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నారు అంతా. అయితే అదంతా పాల పొంగులా చల్లారిపోయింది. ఆ సినిమాలు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ నాగ్ తో సినిమాతో పాటు వెబ్ సిరీస్ మీద దృష్టి పెడితే , కేతిరెడ్డి చెన్నై వెళ్లి తమిళ రాజకీయాల మీద ప్రెస్ మీట్స్ పెడుతున్నారు.

ఇక ఈ ఇద్దరితో పాటు లక్ష్మీపార్వతి కూడా సైలెంట్ అయిపోయారు. అదెలా సాధ్యమైంది అన్నదే ఎన్టీఆర్ మీద మూడు సినిమాలు చూద్దాం అనుకున్నవాళ్ళకి అంతుచిక్కని ప్రశ్న. కాస్త లోతుగా ఆరా తీసినప్పుడు దీనికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. ఇంతకుముందు ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ , లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలు ఇప్పట్లో రాబోవు. ఒకదాని మీద ఇంకోటి పోటీ అనుకున్న ఈ సినిమాలు షూటింగ్ జరక్కుండా కొందరు కీలక వ్యక్తుల మధ్య రాజీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఎన్నికల లోపు ఈ సినిమా షూటింగ్ జోలికి వెళ్ళకూడదు . ఆ తర్వాత కూడా ఎవరి మీద సినిమా తీయాలి అనుకున్నా బౌండెడ్ స్క్రిప్ట్ తో ముందుగా సంబంధిత వ్యక్తులు, కుటుంబాల అంగీకారం తీసుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మీస్ ఎన్టీఆర్ , లక్ష్మీస్ వీరగ్రంధం ఇప్పట్లో తెరకి ఎక్కే ఛాన్స్ లేనట్టే .