బ్రేకింగ్ : కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యం… ఆ అదృశ్య శక్తి ఎవరు ?

Congress 5 MLAs and JDS 2 MLAs Missing in Karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాజకీయం క్షణ క్షణానికి మారిపోతోంది. నిన్న జరిగిన కౌంటింగ్ లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 38, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలిచారు. ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాణి నేపధ్యంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై గవర్నర్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నారని, ముందుగా ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై గవర్నర్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ తమ పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రకాశ్ జవదేకర్, నడ్డాలు నిన్ననే కర్ణాటక చేరుకావడంతో బీజేపీఎల్పీ నేతను మరికాసేపట్లో ఎన్నుకోనున్నారని తెలుస్తోంది.

అయితే మరో పక్క కాంగ్రెస్, జేడీఎస్ లు కూడా శానససభ పక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి నుంచి కన్పించక పోవడంతో ఆ పార్టీలో ఆందోళన అధికమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ నేత యడ్యూరప్ప టచ్ లోకి వెళ్లారన్న వార్తలు కాంగ్రెస్ ను కలవరపరుస్తున్నాయి. వారి కోసం ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వెతుకులాట ప్రారంభించారు. కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సిఎల్‌పి) సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కూడ్లగి ఎమ్మెల్యే నాగేంద్ర, అమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్యేలు భీమా నాయక్, అమెర్ గౌడ నాయక్ లు కనిపించకుండా పోవడంతో అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మరో పక్క జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామికి కూడా ఆ పార్టీ కి చెందినా ఎమ్మెల్యేలు షాకిచ్చారు. బెంగళూరులో ఓ హోటల్‌లో ప్రారంభమైన జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు గౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశానానికి రాలేదు. వాళ్లు రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై జేడీఎస్ నేతలు ఎక్కడా స్పందించ లేదు. దీంతో రాజకీయ పక్షాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి మద్దతుగా వెళ్లేందుకే వాళ్లు సమావేశానికి రాలేదని చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అంటే కాంగ్రెస్ నుండి ఐదుగురు జేడీఎస్ నుండి ఇద్దరు మొత్తం ఏడుగురు బీజేపీ క్యాంప్ కి గనుక వెళితే ఇప్పుడు 104 గా ఉన్న బీజేపీ నంబర్ 111 కి చేరుతుంది అయినా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాల్సి రావడంతో మొత్తం మీద బీజేపీ ఎలాంటి షాకిస్తోందన్న టెన్షన్ ఇటు కాంగ్రెస్ లోనూ, అటు జేడీఎస్ లోనూ కన్పిస్తోంది.