వచ్చే మంగళవారమే కాంగ్రెస్‌ అసెంబ్లీ టిక్కెట్ల ప్రకటన..!

We will give lapis..we will buy cow dung..these are the 7 guarantees of Congress in Rajasthan
We will give lapis..we will buy cow dung..these are the 7 guarantees of Congress in Rajasthan

రేపు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ “వార్ రూమ్”లో ఈ సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10న కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం జరుగనుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ టిక్కెట్లను వచ్చే మంగళవారం కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఖరారు చేయనుంది.

ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం కానుంది. పార్టీ “వార్ రూమ్” లో ఆదివారం జరిగే సమావేశంలోఖరారైన అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” కి “స్క్రీనింగ్ కమిటీ” సిఫార్సు చేయనుంది. తెలంగాణ అసెంబ్లీకి అభ్యర్ధులను విడతల వారీగానా…? లేదా ఒకేసారి మొత్తం జాబితాను ప్రకటిస్తారా అనే అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అభ్యర్దుల ఖరారు ప్రక్రియను ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా, వేగవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.