Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక అధికారపక్షంలోని కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య అప్పుడే విభేదాలు పొడచూపాయి. సంకీర్ణ పాలన ఆరంభమైన మూడు రోజులకే ఎన్నికలలో ఇరు పార్టీలు తలపడే పరిస్థితి ఏర్పడింది. ఒక సీటు కోసం రెండు పార్టీల మధ్య మొదలయిన పోటీ కొలిక్కి రావటం లేదు. సదరు సీటును తమకు వదిలి పెట్టాలంటూ కాంగ్రెస్.. లేదు తమకే వదిలి పెట్టాలంటూ జేడీఎస్ లు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఓ సీటు విషయంలో ఇరువురు ఎక్కడా రాజీ పడని పరిస్థితి. ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నకు సంబంధించిన అపార్ట్మెంట్లో 9వేలకుపైగా ఓటరు కార్డులు లభించడంతో ఎన్నిక వాయిదాపడిన రాజరాజేశ్వరీనగర్ నియోజకవర్గ పోలింగ్ ఈ నెల 28న సోమవారం జరుగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న, జేడీఎస్ అభ్యర్థి రామచంద్రలు ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో త్రిముఖ పోటీ అనివార్యం అవుతోంది. ఆ సీటు విషయంలో రెండు పార్టీలు మాట వినకపోవడంతో భాజాపా సహా మూడు పార్టీలు వేర్వేరుగానే ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాలన ఏర్పాటుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు మైత్రి ఏర్పాటు చేసుకున్నా ఒక స్థానం కోసం పోటీ పడడంపై వారి సంబంధం పై రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు రోజుల కూడా కాకముందే.. ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పోటీకి దిగటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పక్ష అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవకుండా ఉండేందుకు వీలుగా.. రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు..సీఎం, డిప్యూటీ సీఎంలు శనివారం రాజీ చర్చలకు మరో సారి ఇరువురు అభ్యర్థులను ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ఉత్కంటగా మారింది.