బీజేపీకి షాక్…ఇప్పుడు హరి VS హరి…!

Congress Leader Hariprasad is Opposition Nominee For RS Deputy Chairman

రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తోన్న బీజేపీకి షాక్ ఇచ్చాయి విపక్షాలు. విపక్షాల తరఫున కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ను బరిలోకి నిలపాలని విపక్షాలు అన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. రాజ్యసభ ఉపాధ్యాక్ష పదవికి రేపు ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ, సీపీఐ, టీఎంసీ, బీఎస్పీ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. సీపీఐ నేత రాజా స్వయంగా హరిప్రసాద్ పేరును ప్రకటించారు.కాంగ్రెస్ అభ్యర్థికి ఆప్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది. అసలు ముందు విపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌ను పేరు దాదాపు ఖరారు చేశారు. మంగళవారం రెండోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశమైనప్పుడు ఎన్సీపీ సభ్యురాలు వందనా చవాన్ పేరును బీజేపీ నేత సతీశ్ చంద్ర మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డేరక్ ఓబ్రెయిన్ ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.Congress Leader Hariprasad is Opposition Nominee For RS Deputy Chairman

మరి ఏమయిందో ఏమో కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హరి ప్రసాద్‌ పేరును తెరమీదకి వచ్చింది. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. అయితే, ఆజాద్ కోరికను సున్నితంగా తిరస్కరించిన నవీన్ పట్నాయక్, తాము జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతిస్తామని హామీ ఇచ్చామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ కు ఓటు వేయాలని తమ నేత చంద్రబాబు, తమ పార్లమెంటరీ పార్టీ తరపున నిర్ణయం తీసుకున్నామని సుజనా చౌదరి తెలిపారు. ఇంతకు మునుపు పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యుడిగా పోటీ చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేయగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధికి తెలుగుదేశం ఎంపీలు వోటు వేయనున్నారు.