విశాఖలో కాంగ్రెస్ నేత దారుణ హత్య !

Congress Leader Murdered In vizag

విశాఖలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అక్కయ్యపాలెం ఎన్జీవోఎస్ కాలనీలోని నివాసంలో ఆమెను దారుణంగా హత్య చేసి బాత్రూమ్‌లో పడేసి వెళ్ళిన ఘటన కలకలం రేపుతోంది. విజయా రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. విజయారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఆమెను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. విజయారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు ఆమె భర్త బ్యాంక్‌ ఉద్యోగి. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే అంశం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.