మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు.. అంతకంతకూ పెరిగిపోయిన ఆశావహులు.. అయితే లేటెస్ట్‌గా మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలో ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్సే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా .. మొన్నటిదాకా కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని చెబుతూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.