Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Congress Leaders Missing Their Unity by Clashes Among Them
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని కలలు కంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కార్యకర్తలే షాక్ ఇచ్చారు. ఏకంగా అగ్రనేతలు మాట్లాడే సమయంలోనే గలాటా సృష్టించారు. నేతలు కూడా బుర్రా, బుద్ధి లేకుండా టీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీని టార్గెట్ చేయడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. అసలు నేతలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వారికే తెలియదని మండిపడ్డారు.
పార్టీ బలోపేతంలో భాగంగా శంషాబాద్ శివారులో టీకాంగ్రెస్ ట్రైనింగ్ క్లాసులు నడుపుతోంది. సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డితో పాటు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి తదితరులంతా హాజరయ్యారు. ముందుగా మాట్లాడిన జైపాల్ రెడ్డి టీఆర్ఎస్ ఊసెత్తకుండా కేవలం బీజేపీని తిట్టిపోసి తానో జాతీయ నేతను అనిపించుకోవాలని తాపత్రయపడ్డారు. కానీ టీఆర్ఎస్ ను తిట్టాలని గేలిచేసిన క్యాడర్.. ఆయన గాలి తీసేశారు. ఆ తర్వాత ఉత్తమ్ వంతు. ఉత్తమ్ ఏకంగా పార్టీకి ఓ ఛానెల్, పేపర్ కావాలని ప్రకటించండతో.. కోమటిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.
టీకాంగ్రెస్ ఎప్పట్నుంచో నడుస్తున్న ఉత్తమ్, కోమటిరెడ్డి వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను స్టేజ్ పైకి పిలవలేదనే సాగుతో రగడ జరిగింది. అసలు కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ క్లాసుల్లోనే కొట్టుకుంటే.. రేపు ఎన్నికల సమయంలో ఇంకేం కలిసుంటారని సీనియర్లు నిట్టూరుస్తున్నారు. వీరి డ్రామా చూసిన అధిష్ఠానానికి కూడా తల బొప్పి కడుతోంది. ఎవర్ని ఇంచార్జ్ గా పంపితే.. వీళ్లు సెట్టవుతారో తెలియడం లేదని సోనియా.. అహ్మద్ పటేల్ దగ్గర వాపోవాల్సి వస్తోంది.
మరిన్ని వార్తలు:
బాలుడి హత్య కేసుః నిందితుడి అరెస్ట్
సెప్టెంబరు 9 సచిన్ కు ఎంతో ప్రత్యేకం