ఎమ్మార్వో సజీవదహనంపై స్పందించిన కాంగ్రెస్ ఏం.పి.

ఎమ్మార్వో సజీవదహనంపై స్పందించిన కాంగ్రెస్ ఏం.పి.

అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సంఘటన సంచలనం రేపింది. విధుల్లో ఉన్న ఓ తహశీల్దార్‌ విజయా రెడ్డిను పట్ట పగలు సురేశ్ అనే వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పు అంటించి సజీవ దహనం చేశాడు. తర్వాత అతను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

హయత్‌ నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో దుండగుడు సురేశ్ చికిత్స పొందుతున్నాడు. తహశీల్దార్ విజయా రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రభుత్వం సరైన రక్షణ అధికారులకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సంఘటనకు కారకులైన నిందితులను శిక్షించాలని ట్వీట్ చేశారు.