జగ్గారెడ్డి అరెస్ట్….కారణం అదే…!

Congress Party Leader Jaggareddy Arrest
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డిని నిన్న అర్ధరాత్రి పటాన్‌చెరులో అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డి నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2004లో తప్పుడు పత్రాలతో వీసా పొంది కుటుంబ సభ్యులతో పాటు నెల రోజులు అమెరికాలో గడిపి వచ్చినట్లు గుర్తించారు. నార్త్‌జోన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒక ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విప్ గా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలతో ఆయన అరెస్ట్ జరిగింది. ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద మరో కుటుంబాన్ని అమోరికాకు తీసుకుని వెళ్లారు. 14 ఏళ్ల తరువాత బయట ఈస్కామ్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
JANGAREDDY-ARREST
2004 సంవత్సరంలో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వ విప్ గా కూడా నియమించబడ్డారు. తన కుటుంబం అమోరికాకు వెళ్లాలని అనుకుంటుందని అందుకు గాను తనతో పాటుగా తన కుటుంబానికి పాస్ పోర్టు లు కావాలని పాస్ పోర్టు ఆఫీసులో పాస్ పోర్టు దరఖాస్తు చేసుకున్నారు. తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కూమారుడు భరత్ సాయి రెడ్డిగా పేర్కొన్నాడు. ఇందుకు గాను వారి ఫోటోలను కూడా పంపించాడు. ప్రభుత్వ విప్ ఏకంగా తన అధికారిక పత్రం మీద పాస్ పొర్టుల కొరకు ధరఖాస్తు చేసుకొవడంతో అధికారులు ఏమి చూడకుండానే పాస్ పొర్టులు జారీ చేశఆరు. ఇదే తరహాలో అమోరికా ఎంబసీకి కూడా అధికారిక లెటర్స్ ను పెట్టుకున్నారు. ప్రభుత్వ విప్ నుండి వచ్చిన అధికారిక లెటర్ కావడంతో అమోరికా ఎంబసీ అధికారులు కూడా ఏమి చూడకుండానే వీసా లు ఇచ్చేశారు. దీంతో 2004 సంవత్సరంలో జగ్గారెడి తన నకీలీ కుటుంబ సభ్యులతో కలిసి అమోరికాకు వెళ్లారు. అమోరికాకు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉన్నారు. తరువాత జగ్గారెడ్డి ఒక్కరే అమోరికా నుంచి తిరిగి వచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డి అమోరికాలో వదిలి వచ్చిన నకీలీ కుటుంబ సభ్యులు ఎక్కడ వున్నారో తెలియదని పోలీసులు అంటున్నారు. జగ్గారెడ్డి భార్య, కొడుకు కూతుర్ల స్దానంలో అమోరికాకు తీసుకుని వెళ్లిన వారు ఎవరు అన్నది ఇప్పడు తేల్సాలి వుంది. అయితే డబ్బులు కోసం చేశారా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనను గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. ఆయనను ఈరోజు సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
jangareddy-arrest-in-passpo