బీజేపీకి మరో గట్టి షాక్ !

Congress wins in Karnataka Jayanagar Constituency By-Poll election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో గట్టి షాక్‌ తగిలింది. మొన్న కర్నాటక ఎన్నికలతో బాటే జరగాల్సిన జయనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అకస్మిక మరణంతో మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక వాయిదాపడింది. అయితే దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ స్థానానికి జూన్‌ 11న (సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ ఉపఎన్నిక ఇటీవలే జరుగగా ఈరోజు ఆ వోట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్‌ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి.

తాజా గెలుపుతో కాంగ్రెస్‌ బలం 80కి చేరింది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యకు జేడీఎస్‌ మద్దతు ప్రకటించడం… కాంగ్రెస్‌ విజయానికి కలిసొచ్చింది. జయనగర్‌ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ​కౌంటింగ్‌ సెంటర్‌ బయట డ్యాన్స్‌లు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ ను బీజేపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దింపగా, కాంగ్రెస్‌ అభ్యర్థిని సౌమ్యారెడ్డిని బలపరుస్తూ తమ అభ్యర్థిని జేడీఎస్‌ ఉపసంహరించుకుంది. ఈ నియోజకవర్గంలో ప్రహ్లాద్ వైపు ఓటర్ల సింపతీ పవనాలు వీస్తాయని బీజేపీ భావించగా అందుకు విరుద్ధంగా సౌమ్యా రెడ్డి గెలుపొందటం గమనార్హం.