కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ కానిస్టేబుల్ కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ విభాగానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎంతో మనోవేదనకు గురయ్యాడు ఆ హెడ్ కానిస్టేబుల్. కోరనా రావడంతో బెంగళూరులోని సీవీ రామన్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అతడిని తరలించడానికి ఓ ప్రత్యేక మినీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ మినీ బస్సులోనే గమ్యానికి చేరేలోపే ఆత్మహత్య చేసుకోవడం ఇప్పడు సర్వత్రా కలకలం రేపుతోంది.