మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన మేరకు..మూలుగు జిల్లా వాజేడు మండలం తగుళ్లపల్లి గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు నాగసాయిచందు (27). నగరంలోని మేడిపల్లి పరిధిలోని విహారిక కాలనీలో ఉంటూ మేడిపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత పదిహేను రోజులుగా నాగసాయిచందు లీవ్‌లో ఉన్నాడు.
గురువారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు పని చేసే కానిస్టేబుల్ ప్రసన్న గమనించి కిందికి దించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు, నాగసాయిచందుకు మధ్య వివాదం ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.