రంభ, రాశిలకి వార్నింగ్ ఇచ్చిన కోర్టు !

Consumer Goods Court Gives Shock To Rambha And Rasi

ఊబకాయం తగ్గిస్తామని, మీరు కూడా సినీ తారల్లా నాజూగ్గా మారిపోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటనలతో ఊదర కొడుతూ ఉంటాయి. అలా కలర్స్ అనే వెయిట్ లాస్ సంస్థ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాశి, రంభలతో ప్రత్యేకంగా యాడ్ రూపొందించి స్వల్పకాలంలో బరువు తగ్గిస్తామంటూ ప్రచారం చేస్తూ వస్తోంది. కాగా ఆ సంస్థ ప్రకటన చూసి తాను ట్రీట్ మెంట్ తీసుకుని బరువు తగ్గకుండా మోసపోయిన ఓ వినియోగదారుడు విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ కు వెళ్లారు. విచారణ జరిపిన జస్టిస్‌ మాధవరావు ఆ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ. 74,652 రూపాయలను 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలు జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చారు. అంతేగాక రాశి, రంభల యాడ్స్‌ను వెంటనే ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నకిలీ సేవలను ప్రోత్సహిస్తూ ప్రకటనలు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సినీ తారలకు సూచించారు. ఎవరైనా సెలబ్రిటీలు కనుక నటిస్తే వారికి కూడా జరిమానా విధించాల్సి ఉంటుందని చెప్పింది.