భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా సేవలు అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేయనుంది. ఈ వివరాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
