నిన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా హై కోర్ట్ యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. కలకత్తా హై కోర్ట్ ఒక లైంగిక కేసులో భాగంగా తీర్పును ఇచ్చే సమయంలో మాట్లాడుతూ… కౌమార దశలో ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు అందరూ ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి అంటూ చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసింది.
ఈ వయసులో సాధారణంగా లైంగికమైన కోరికలు కలగడం తెలిసిందే. కానీ మీరు వీటికి అట్రాక్ట్ అయ్యి రెండు నిముషాల సుఖం కోసం తొందరపడితే సమాజం మొత్తం దృష్టిలో మీరు చెడ్డవారుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ వయసులో వచ్చే కోరికలను అదుపులో పెట్టుకుని మీ లక్ష్యాలవైపు దృష్టిని మళ్లించండి అంటూ చెప్పింది హై కోర్ట్. ఇక అబ్బాయిలకు కూడా మీరు మహిళలను గౌరవించడం నేర్చుకోండి అంటూ సూచించింది. ఇక లైంగికంగా కలిశాడన్న యువకుడి కేసులో మైనర్ బాలిక అంగీకారంతోనే కలిశాడని తేలడంతో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.