రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మిస్తామని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆగ్రహించిన అమరావతి ప్రాంత రైతులు అందరు కూడా, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు. అయితే రైతులు దీక్షలు చేపట్టి నేటికీ 20 రోజులు గడుస్తున్నాయి. కాగా ఇప్పటికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో స్పందించకపోవడంతో, రైతులు వారి ఆందోళనలని మరింతగా ఉదృతం చేస్తున్నారు. కాగా కొందరు రైతులు తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు నేడు మహా పాదయాత్రను ప్రారంభించారు.
అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేస్తున్నటువంటి ఆ పాదయాత్రలని ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో భాగంగా మన జాతీయ జెండాలు చేతబట్టి, జై అమరావతి నినాదాలతో పెద్దగా నినదిస్తున్నారు. అంతేకాకుండా “మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు” అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఇకపోతే గతంలో రాష్ట్ర రాజదాని నిర్మాణం కోసమని రైతులందరూ కూడా 33 వేల ఏకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను, రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తుందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.