ఆంధ్ర రాష్ట్రంలో 1403 కు చేరుకున్న కరోనా కేసులు

ఆంధ్ర రాష్ట్రంలో 1403 కు చేరుకున్న కరోనా కేసులు

గత రెండు వారాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఆ లెక్క కాస్తా కాస్త నిలకడగా ఉందని చెప్పాలి. గత వారం రోజుల కితం వరకు ఏపీలో 80 కి పైగా కేసులు నమోదు అయ్యేవి ఇప్పుడు ఆ అంకె 70 లకు దిగి అదే గ్రాఫ్ కొనసాగుతుంది.

పరీక్షలు ఎక్కువ అవుతున్న కొద్దీ కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య మెల్లగా క్షీణించే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో నమోదు కాబడిన కరోనా పాజిటివ్ కేసుల జాబితా ఇపుడు బయటకు వచ్చింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 71 కొత్త కేసులు నమోదు అయ్యినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్ధారించారు.

దీనితో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1403 కు చేరుకుంది. అయితే ఈ 71 లో మాత్రం సగానికి పైగా ఒక్క కర్నూల్ జిల్లాలోనే నమోదు అయ్యాయి. అక్కడ ఏకంగా 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో అక్కడ కేసులు 386 కు ఎగబాకింది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.