ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5836కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 864049 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి నెల్లూరులో ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు కరోనా సోకి 7059 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటివరకు 1,08,75,925 శాంపిల్స్‌ను పరీక్షించారు.