దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు మొత్తం 14,83,156 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 4,96,988 యాక్టివ్ కేసులు ఉండగా, 9,52,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏకంగా 654 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 33,425కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 5,28,082 కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 1,73,34,885కి చేరింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 64.2గా ఉంది.