భారత్లో కరోనా కేసుల ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 45,903 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 490 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,53,657 కి చేరింది.
అయితే ప్రస్తుతం అందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా, 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,26,611 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 48,405 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,35,401 శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 92.6 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.