ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ కి సంబందించిన పాసిటివ్ కేసులు రోజురోజుకు చాలా దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా లెక్కల ప్రకారం చూసుకుంటే, కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడంతో జిల్లా ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అయితే గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58 కరోనా పాసిటీవ్ కేసులు నమోదవ్వగా, అందులో కర్నూలు జిల్లాలోనే 32 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో భయాందోళన మరింతగా పెరిగిపోయింది. ఈ మేరకు అక్కడ లాక్ డౌన్ చర్యలను మరింతగా కట్టుదిట్టం చేయాలనీ అధికారులకు ఆదేశాలు అందాయి.
కాగా పూర్తిగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 466 కు పెరిగింది. ఇకపోతే రెండవ స్థానంలో గుంటూరు జిల్లా లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంటే గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 319 కి పెరిగింది. ఆ తరువాత స్థానంలో కృష్ణ జిల్లా ఉంది. ఇప్పటి వరకు నమోదైన లెక్కల ప్రకారం కృష్ణ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 266 కి చేరుకుంది. కాగా ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు సడలించేది లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.