తెలంగాణలో ఒక్క రోజులో 40 శాతం కేసులు

తెలంగాణలో ఒక్క రోజులో 40 శాతం కేసులు

తెలంగాణలో ఒక్క రోజులో మునుపటి రోజుపై 40 శాతం కేసులు పెరగడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కరోనా రోగుల సంఖ్యలో తెలంగానది ఐదో ఆరో స్థానమో కావచ్చు గాని పాజిటివిటీ రేటు అటూ చాపకింద నీరులా అది వ్యాపించిన తీరు ఘోరంగా ఉంది. టెస్టుల్లో వచ్చే పాజిటివ్ కేసుల పర్సెంటీజేలో దేశంలో తెలంగాణది నెం.1 స్థానం. అంటే డేంజర్ పరంగా మహారాష్ట్రకు తెలంగాణ ఏం తీసిపోదు అని దీనర్థం.

దేశంలోనే అతితక్కువ టెస్టులు చేసిన తెలంగాణపై అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక క్రమంగా టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. దాంతో నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే అందరికీ కనిపించే ఈ కేసుల నెంబరు కన్నా కరోనా తెలంగాణలో వ్యాప్తిస్తున్న తీరు ప్రజలను ప్రభుత్వాన్ని భయకంపితులను చేస్తోంది.

వారం క్రితం వరకు వందల్లో వచ్చిన కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. వారం నుంచి రోజుకు వెయ్యికి అటూ ఇటూ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. శుక్రవారం ఏకంగా 1892 కేసులు బయటపడ్డాయి. ఇది నగర పరిస్థితి తీరుకు, తెలంగాణలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. చేసిన టెస్టుల్లో వందకు ఎన్ని పాజిటివ్ అన్నది చూస్తే తెలంగాణ మొదటి స్థానంలో, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉండటం గమనార్హం.