ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి… ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల కేసులు నమోదైనట్లు సమాచారం. ఇకపోతే భారత్ లోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ భయంకరమైన వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 16 కరోనా కేసులు నమోదవ్వగా, ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 3 కి చేరిందని సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే 966 మందికి అబ్జర్వేషన్ లో ఉంచి పరీక్షిస్తున్నారని తాజా సమాచారం. అయితే వారిలో కొందరు మాత్రం గృహనిర్బంధంలో ఉన్నారు. మిగిలిన వారు కొందరు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు.
ఇకపోతే ఏపీలోని వైజాగ్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ళ వ్యక్తికి ఈ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఇకపోతే ఆ వ్యక్తి ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి రావడం వలన ఈ వైరస్ సోకిందని సమాచారం. కాగా ఆ వ్యక్తిని చిన్నవాల్తేరు ప్రాంతం లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అనుమానితులని అందరిని కూడా ప్రత్యేకంగా పరీక్షిస్తూ, జాగ్రత్తలతో కూడిన చర్యలన్నింటిని కూడా ముమ్మరం చేశారు ప్రభుత్వాధికారులు…