కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ ముందు అమెరికా ఉంచిది.
కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్ 2019లో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది ల్యాబ్. అంతేకాదు ఆ ఆస్పత్రి బయట గట్టి కాపలా ఉంచింది.
అమెరికన్ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్ మేకింగ్ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ డిసైడ్ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ డీసీ ప్రచురించింది.