కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కనిపించని శక్తితో యుద్ధం చేస్తుంది. చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు పూర్తిగా క్వారంటైన్లోకి వెళ్లిపోయాయి. దీంతో వాతావరణంలో స్వచ్ఛత, గాలిలో నాణ్యత పెరిగిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగుచూసిన చైనాలోని వుహాన్ నగరంలో ప్రజా రవాణా నిలిపివేసి.
ప్రజలు నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో నైట్రోజన్ ఆక్సైడ్ శాతం గణనీయంగా పడిపోయినట్టు గత ఫిబ్రవరిలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రిలీజ్ చేసిన చిత్రాల ద్వారా వెల్లడైంది. నైట్రోజన్ డయాక్సైడ్ (NO2)వాయువు ప్రధానంగా వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ పవర్ స్టేషన్లు నుంచి రిలీజ్ అవుతుంది. అయితే చైనాలో కోవిడ్-19 ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ అక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు తిరిగి పుంజుకున్నాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ మధ్యనే చిత్రాల ద్వారా స్పష్టం చేసింది.
అదేవిధంగా కరోనా వ్యాప్తి చెందడం కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 10నగరాల్లో ఢిల్లీ ఒకటి. దేశరాజధాని ఢిల్లీలో ప్రతిరోజు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంటుంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొనేవారు. చిన్న పిల్లలు, ముసలి వారు, గర్భిణులు కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేవారు. కరోనాకు ముందు ఢిల్లీలో పెరిగిన వాహణాల పొగ వలన వాయు కాలుష్యం, శబ్దకాలుష్యంతో ప్రజలు తల్లడిల్లిపోయేవారు. మరిప్పుడు ఢిల్లీలో కరోనా పుణ్యమా అని వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. కరోనాతో లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలు ఎవరూ బయటకు రాని పరిస్థితి. దీంతో ఇప్పుడు అక్కడ వాయ, శబ్ద కాలుష్య రహితంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ముఖ్యంగా వాహనాలు తిరుగుడు తగ్గడం, ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూతపడటంతో ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని… కానీ.. కరోనాతో అది ఏకంగా 129కి పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుడం హైదరాబాద్ లో కూడా కాలుష్యం ఎక్కువగా ఉండేది.. ఇప్పుడీ కోరనా దెబ్బకు చాలావరకు తగ్గింది. ఇక బెంగుళూరు, చెన్నై, విజయవాడ వంటి ప్రధాన నరగాల్లో కూడా కరోనా పుణ్యమా అని కాలుష్యం చాలావరకు తగ్గింది.
కాగా మార్చి 5 2020 సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. వాతావరణంలో నైట్రొజన్ ఆక్సైడ్ స్థాయిలు ముంబై, పూణేలో సుమారు 45%, అహ్మదాబాద్ లో 50% కన్నా తక్కువ శాతం తగ్గాయని నిపుణులు వెల్లడించారు.
గత సంవత్సరం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల్లో సగం భారతదేశంలో ఉన్నాయి. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ అదించిన వివరాల ప్రకారం… పరిశ్రమలు, వాహనాల ఎగ్జాస్ట్, బొగ్గు ఆధారిత ప్లాంట్ల ద్వారా అధికంగా కాలుష్యం ఉందని అధికారులు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం న్యూఢిల్లీ చాలా నిర్మలంగా ఉంది. కార్లు, రిక్షాలు, మోటారు-బైక్‌లు, బస్సులతో నిండిన రహదారులు ఖాళీగా ఉండటంతో, న్యూ ఢిల్లీ వంటి కాలుష్య ప్రాంతాలు కూడా మంచి పురోగతిని ఇస్తున్నాయని ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికారులు వెల్లడించారు. గ్రీన్ హౌస్ గాసెస్ తగ్గుముఖం పట్టి వాతావరణంలో మంచి పురోగతి కనిపిస్తుంది వెల్లడౌతున్న సత్యం.