కరోనా ఎఫెక్ట్: చైనాలో కుక్కమాంసం నిషేదం

చైనాలో పుట్టి ప్రపంచాన్ని విణికించేస్తున్న కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఇది అంతమౌతుంది అనేది కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ సృష్టిస్తున్న ప్రకంపణలతో చైనా ప్రజల ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా చైనావాళ్లు ఏది పడితే అది తింటూ ఉంటారు. కేవలం వాళ్ల వల్లే ఈరోజు ప్రపంచమంతా ఇంత అవస్థ పడుతుంది అనేది కాదనరాని నిజం. వుహాన్ లోని వన్యప్రాణుల మార్కెట్ నుండే కరోనా వైరస్ పుట్టింది. దీంతో మధ్య చైనాలో కుక్క మాంసం విక్రయాలు, వినియోగంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకమీదట కుక్కల్ని కూడా పెంపుడు జంతువులుగానే చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చైనాలో ప్రతి సంవత్సరం రెడు కోట్ల వరకు కుక్కల్ని, 40లక్షల వరకు పిల్లులను ఆహారం కోసం చంపితింటారు. గ్యాంగ్జీ ప్రావిన్సులోని యులిన్ సిటీలో ఏకంగా జూన్ 21 నుంచి 30 వరకూ ప్రత్యేకంగా కుక్క మాంసం పండుగనే వేడుకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వేలాది కుక్కలను చంపి తింటారు. తమకు కావల్సిన కుక్కను ఎంపిక చేసుకుని చెప్తే చాలు.. వారి సమక్షంలోనే చంపేసి మాంసం ప్యాక్ చేసి ఇస్తుంటారు.

అలాగే… వేసవి కాలంలో రెస్టారెంట్లలో కుక్క మాంసానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇది చాలా దారుణమని.. అమానుషమన… వెంటనే ఇలాంటివి ఆపేయాలని అక్కడ కూడా లక్షల మంది ప్రభుత్వానికి ఎన్నోమార్లు మొరపెట్టుకున్నారు. కానీ.. జనం విజ్ఞప్తిని చైనా ప్రభుత్వం పెడచెవిన పెట్టుకుంటూ వస్తుంది. అయితే కరోనా దెబ్బకు మాత్రం కాస్త కదిలింది. డాగ్ మీట్‌ ను నిషేదిం విధించడంతో పాటు వాటిని పెట్ యానిమల్స్‌ లా చూడాలని కూడా చైనా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని జంతు ప్రేమికులు స్వాగతిస్తున్నారు.

కానీ… ఇదో గేమ్ ఛేంజర్ గా మరికొందరు అభివర్ణిస్తన్నారు. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాల్ని, వినియోగాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే షెన్ జెన్ లో పిల్లులు, పాములు, బల్లులు, వన్యప్రాణుల అమ్మకాల్ని, వినియోగాన్ని నిషేధించారు. తాజాగా చైనా మొత్తంగా కుక్కమాంసాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటికే తైవాన్, హాంకాంగ్ దేశాల్లోనూ… కుక్క మాంసం విక్రయించడాన్ని బ్యాన్ చేశారు. అయితే చైనాలో కుక్క మాంసం అందరూ తినరు. కొంతిమంది మాత్రమే అమిత ఇష్టంగా తింటారు. దీంతో నిషేధించడం పెద్ద కష్టం కాదని అంతటా హర్షం వ్యక్తమౌతుంది. ఏది ఏమైనప్పటికీ.. కరోనా వైరస్ చైనా ఆహారపు అలవాట్లలో భారీ మార్పులనే కాకుండా సమూల ప్రక్షాళన తీసుకు వస్తుండటం విశేషం.