సినిమాలను దెబ్బ కొడుతున్న కరోనా

సినిమాలను దెబ్బ కొడుతున్న కరోనా

ప్రస్తుతం అందరు కరోనా దెబ్బకి ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు.అందులోను పిల్లలకు పరీక్షల సమయం.దీంతో చిన్న సినిమాలు విడుదల చేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందేమో అనే భయం ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. మార్చ్ 25 నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి కనుక అప్పటిలోగా వైరస్ భయం పోతుందని ఆశిస్తున్నారు. ఏదేమైనా కేరళలో సినిమా థియేటర్లు మూత పడ్డాయనే వార్త తెలుగు సినిమా బిజినెస్ వర్గాలని వణికిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో నాని నటించిన వి రిలీజ్ అయితే రికవరీ కష్టం అవుతుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతోంది. ఓవర్సీస్ బిజినెస్ మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. యూఎస్ లో ముప్పై మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారనే వార్త అక్కడ కలకలం రేపుతోంది. పరిస్థితులని పరిగణనలోకి తీసుకుని దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా ఉంది.