దేశవ్యాప్తంగా కరోనా ప్రతి ఒక్కరిని కుదిపేస్తోంది. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయిన తొలి వ్యక్తికి ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా నుంచి ఇతడు నెగిటివ్ అయ్యాడు. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్‌మేన్ కొద్ది రోజుల క్రితం వ్యాపార పని నిమిత్తం యూరప్ వెళ్లాడు. ఇక ఇప్పుడు కరోనా తగ్గిపోవడంతో ఆయన తన అనుభవాలు వివరిస్తున్నారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో రెండువారాలపాటు చికిత్స పొందిన సదరు బాధితుడు ఇప్పుడు కరోనా గురించి ఎంత మాత్రం చింతించాల్సిన పనిలేదని చెపుతున్నాడు.ఆరోగ్య వంతుడు అయిన వ్యక్తులకు కరోనా సోకితే కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినా వెంటనే తగ్గిపోతుందని.. ఈ విషయంలో ఎవ్వరూ ఎలాంటి అపోహలు పడవద్దని చెపుతున్నారు. ఇక భారత హెల్త్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన హెల్త్ సిస్టమ్స్‌లో ఒకటిగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఆదివారం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సదరు బాధితుడిని డాక్టర్లు మరో 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని కూడా సూచించారు.
తనకు ముందు హెల్త్ బాగోకపోవడంతో సాధారణ జ్వరం అనుకున్నానని… అయినా తగ్గకపోవడంతో రామ్ మనోహర్ లోహియా హాస్పటల్‌కు తరలించడంతో అక్కడ టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇక ముందుగా దగ్గు, జలుబుతో ప్రారంభమయ్యాక ఇది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుందని ఆ బాధితుడు చెప్పారు. ఏదేమైనా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా బాధితుడిని అయిన తాను ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్‌గా బయట పడడం ఆనందంగా ఉందని చెప్పారు.ఇక సాధారణ ట్రీట్‌మెంట్‌తోనే ఈ కరోనా తగ్గిపోతుందని కూడా చెప్పాడు. ఇక సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో నన్ను ఉంచి ఐసోలేషన్ వార్డులో సదుపాయాలు చాలా బాగున్నాయి. ప్రైవేటు హాస్పటల్స్‌లో తాను చూసిన వాటిలో ఈ హాస్పటల్ అత్యుత్తమంగా ఉందని కూడా సదరు బాధితుడు చెప్పాడు. ఓవరాల్‌గా కరోనా విషయంలో అపోహలు వద్దని అతడు చెప్పడం అందరికి ధైర్యాన్ని ఇచ్చింది.