Corona Updates: రాజమహేంద్రవరంలో కొవిడ్ కేసు నమోదు

Corona Updates: 628 corona cases and one death in last 24 hours
Corona Updates: 628 corona cases and one death in last 24 hours

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ వృద్ధురాలికి కొవిడ్ సోకిందన్న ప్రచారం కలవరపెడుతోంది. నగరంలోని దానవాయిపేటకు చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి లక్షణాలు ఉండటంతో మందులు వినియోగించారు. ప్రైవేటులో ర్యాపిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వైద్యసిబ్బంది నమూనాలను కాకినాడలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్కు పంపగా అక్కడ సైతం పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. దీన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.