లక్షకు పైగా చేరిన కరోనా కేసులు

లక్షకు పైగా చేరిన కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నట్లు వార్తలు వస్తుంటే… మరోవైపు దేశాలకు దేశాలకు వ్యాప్తి చెందుతూ కొత్త గుబులు రేపుతోంది.అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా కారణంగా ప్రపంచంలోని 92 దేశాలకు ఈ మాయదారి వైరస్ అంటేసింది. అంతేనా… తాజాగా ఈ వైరస్ బారిన పడిన కేసులు లక్షకు పైగా నమోదు కావటం గమనార్హం. ఈ పిశాచి బారిన పడి ఇప్పటివరకూ 3456 మంది మరణించగా… అత్యధిక మరణాలు ఆసియా ఖండంలోనే చోటు చేసుకోవటం గమనార్హం. హాంకాంగ్… మకావ్ మినహాయిస్తే చైనాలోనే 80వేల కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్క దేశంలోనే 3042 మంది మరణించారు.

చైనా వెలుపల ప్రపంచ వ్యాప్తంగా 20290 కేసులు నమోదైతే… 414 మంది మృతి చెందారు. చైనా తర్వాత అత్యధిక మరణాలు ఇటలీలో చోటు చేసుకున్నాయి. ఈ దేశంలో 197 మంది బలి కాగా… తర్వాతి స్థానం ఇరాన్ గా చెప్పాలి. ఆ దేశంలో 124 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 42 మంది మరణించారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇరాన్ లో 6284 కేసులు నమోదు కాగా… మరణాలు మాత్రం తక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా ఇటలీలో 49 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

ఖండాల వారీగా చూస్తే అత్యధికంగా ఆసియాలో (చైనా మినహాయిస్తే) 101 మంది మరణిస్తే… ఐరోపాలో 214 మంది… పశ్చిమాసియాలో 127 మంది… అమెరికా… కెనడాలో 12 మంది మరణించారు. లాటిన్ అమెరికా… కరేబియన్ దీవుల్లో 34 మందిని ఈ పాడు వైరస్ పొట్టన పెట్టుకుంది. ఆఫ్రికాలోనూ 42 మంది కరోనా కారణంగా బలయ్యారు.