మహమ్మారి కట్టడికి కేంద్ర కీలక చర్యలు

మహమ్మారి కట్టడికి కేంద్ర కీలక చర్యలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కేంద్ర కీలక చర్యలను తీసుకుంటోంది. పరీక్షల నిర్వహణ సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,4,40,908 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి.

వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా బాధితులు కోలుకోగా.. ‍ప్రస్తుతం 3, 90 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమం‍త్రులకు ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.