తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 1,278 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 32,224 కి చేరింది. అయితే ఈ పాజిటివ్ కేసులు రోజురోజుకీ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే గడిచిన 24 గంటల్లో 10,354 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలకి గానూ 1,278 పాజిటివ్ గా తేలింది. అయితే నేడు ఒక్క రోజే 1,013 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 19,205 కి చేరింది. అయితే ప్రస్తుతం రాష్ట్రం లో 12,680 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. నేడు ఒక్క రోజే కరోనా వైరస్ కారణంగా 8 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 339 కి చేరింది. అయితే ఎక్కువగా ఈ పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ లో నే నమోదు అవుతున్నాయి.