వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడిన దంపతులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి, అడపా ఇంద్రకుమారి నవంబర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారికి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు.
వారికి సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీరామమూర్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంద్ర కుమారి మృతి చెందింది. చికిత్స పొందుతూ ఒకేరోజు దంపతులు మృతి చెందటంతో హనుమాన్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీరామమూర్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి సతీశ్, రాజేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి మున్నూరుకాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధురి మధు, రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, తోట గణేశ్ సంతాపం తెలిపారు.