గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 104 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 18,257 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 46 వేల 617 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 1,46,737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళ వారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.