భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,03,933 చేరుకున్నాయి. అలాగే యాక్టివ్ కేసులు 9,60,969 ఉండగా, కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584కు చేరింది.
కరోనా వైరస్‌తో దేశంలో మొత్తం 93,379 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 7,02,69,975 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇక దేశంలో 10 రాష్ట్రాల నుంచే 74 శాతం రికవరీలు నమోదు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా కొత్త కేసుల్లో 75 శాతం కూడా పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయని పేర్కొంది.