భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 3,34,78,419 కి చేరినట్లు వెల్లడించింది.
ఈ మహమ్మారి బారినపడి గత 24 గంటలలో 295 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 4,45,133 కి చేరింది. కరోనా నుంచి తాజాగా, 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,45,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.