భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా కొత్త కేసులు మళ్లీ 40 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 45,951 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో నిన్న 817 మంది మృతిచెందారు. మంగళవారం రోజు 60,729 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36,51,983 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం కోవిడ్‌పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848గా ఉంది. మొత్తం 3,98,454 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,94,27,330 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,37,064 లక్షల యాక్టీవ్ కేసులున్నాయి. దేశంలో 96.92 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.77 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.