రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు

రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు

రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు గణనీయంగా మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా సగటు మరణాలు 2.86 శాతంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 1.73 శాతంగా నమోదైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 60గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 55 మందిని డిశ్చార్జి చేయడంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,281కు చేరింది.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,120గా ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 9,504 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 131 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 61 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, మరో మూడు కోయంబేడు కాంటాక్టులకు సంబంధించినవి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 3,461కి చేరింది. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు 406 మంది ఉండగా, విదేశాల నుంచి వచ్చిన 111 మంది, కోయంబేడు కేసులు 226 ఉన్నాయి. వీటిని మినహాయిస్తే రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులు
సంఖ్య 2,718గా ఉంది.