జూలు విదిల్చిన నారాయణ.

CPI National Secretary K Narayana comments on Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి పదును ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఆయన జాతీయ స్థాయిలో పనిచేయడం, దేశమంతటా వామపక్షాల పట్టు సడలడంతో కొన్నాళ్లుగా ఆయన స్పీడ్ తగ్గింది. తాజాగా మూడేళ్ళ మోడీ బండారం అనే పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించిన ఆయన మళ్లీ విమర్శలతో జూలు విదిల్చారు. ఇంతకీ మోడీ పాలన సహా వివిధ అంశాలపై ఆయన కామెంట్స్ ఓ సారి చూద్దామా.

  • మోడీ మాటలకు పాలనకు ఎలాంటి పొంతనలేదు..
  • మోడీ ఓ మేక వన్నిన పులిలాంటివాడు..
  • ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటంలేదు..
  • ఆర్ధిక నేరగాళ్ల పేర్లు కూడా బయటపెట్టలేని స్థితిలో మోడీ ఉన్నాడు..
  • బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. రైతుల పేర్లు మాత్రం నోటీసు బోర్డుల్లో వేస్తున్నారు..
  • మాజీ rbi గవర్నర్ రఘురామ రాజన్ కార్పొరేట్ శక్తుల గురించి రాసిన బుక్ ని మోడీ చదివితే ఆత్మహత్య చేసుకోవాలి..
  • దేశంలో మతాల పరంగా ఉన్న సెంటిమెంట్స్ ని మాత్రం రాజకీయంగా మోడీ బాగా వాడుకుంటున్నాడు..
  • నోట్ల రద్దుతో బ్లాక్ మనీ అంతా వైట్ మనీ అయిపోయింది…
  • నోట్ల రద్దుతో సాధించిందేంటి.. సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే..
  • టెర్రరిస్టులను అపలేకపోయాడు.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అపలేకపోయాడు.. డ్రగ్ మాఫియాని అపలేకపోయాడు..
  • కార్పొరేట్ శక్తుల నల్ల ధనాన్ని వైట్ చెయ్యడానికే నోట్ల రద్దు చేశారు…
  • Gst వల్ల ప్రజలకు వరిగిందేంటి.. అన్ని వస్తువుల పైన అధిక పన్నులు వేసి రేట్లు పెంచేశారు..
  • అవినీతి కాంగ్రెస్ పాలనలోనే దేశ ఆర్ధిక వృద్ధి రేటు రెండంకెల వండేది.. కానీ మోడీ పాలనలో 5 శాతాన్ని పడిపోయింది..
  • దేశంలో హిందుత్వ ఎజెండానే మోడీ అనుసరిస్తున్నారు.. మతోన్మాద శక్తులు పెంచిపోషిస్తున్నారు..
  • మోడీ,కేసీఆర్, చంద్రబాబు బాబాలను పట్టుకుని తిరుగుతున్నారు..
  • వాళ్లపై వాళ్లకు నమ్మకం లేదుకనుకే.. బాబాల కాళ్లు పట్టుకుంటున్నారు..
  • రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం పెరిగిపోయింది.. అది మంచిదికాదు..
  • రాష్ట్రాలను సహాయం చెయ్యకపోయినా కేసీఆర్, చంద్రబాబులు మోడీ జపం చేస్తున్నారు..