టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసిన్ జహాన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ అసలేం జరిగింది అంటే.. అసలే మోడల్, నటి అయిన హసిన్ ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తాజాగా షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ప్రదర్శించింది. దీంతో చిర్రెత్తిన అభిమానులు ఆమెపై మాటల దాడికి దిగారు.
అయితే ఈమధ్య రోహిత్ శర్మతో ఇన్‌స్టా లైవ్‌లో షమీ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన పేసర్ ఇబ్బందులకు ఆమే కారణమని మండిపడుతున్నారు. షమీపై చేసిన ఆరోపణలు అసత్యమని వెల్లడిస్తూ.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది షమీతో విడిపోయి చిన్నపాప జీవితాన్ని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే.. రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని కూడా తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హాసిన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే షమీ రోహిత్ శర్మతో మాట్లాడుతూ.. ఒక దుర్ఘటన జరిగిన సమయంలో తన కుటుంబం అంతా మద్దతుగా నిలవడంతోనే తాను సమస్యల నుంచి గట్టెక్కానని స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యక్తిగతంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని.. అప్పుడు క్రికెట్‌పై ఆలోచన కూడా రాలేదని.. మేమంతా అప్పుడు 24వ అంతస్థులో ఉండేవాళ్లం కాబట్టి.. తాను బాల్కనీలోంచి దూకేస్తానేమోనని కుటుంబం ప్రతీ క్షణం భయపడేదని వెల్లడించారు. అలాంటి సమయంలో తన సోదరుడు చాలా మద్దతుగా నిలిచాడని. తన ఫ్రెండ్స్ 24 గంటలు తనతోనే ఉండేవారని షమీ తన బాధను రోహిత్ శర్మతో పంచుకున్న విషయం తెలిసిందే.