Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. లండన్ వెస్ట్ మినిష్టర్ లోని హెర్ట్ ఫోర్డ్ స్ట్రీట్ లోని ఓ నైట్ క్లబ్ లో ఫుల్ గా మద్యం సేవించిన వార్న్ …ఆ మత్తులో అక్కడే ఉన్న శృంగార తార వేలెరీ ఫాక్స్ ముఖంపై కొట్టాడు. షేన్ వార్న్ దెబ్బకు ఫాక్స్ ముఖం వాచిపోయింది. ఈ ఫొటోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. షేన్ వార్న్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఓ మహిళపై చేయిచేసుకుని గర్వంగా ఫీలవుతున్నాడని, ఎంత పేరుపొందిన వ్యక్తయినా…
ఓ మహిళను కొట్టి తప్పించుకోలేడని ఫాక్స్ హెచ్చరించింది. నైట్ క్లబ్ లోని ప్రత్యక్ష సాక్షులు కూడా వార్న్ దుందుడుకు ప్రవర్తనను తప్పుబట్టారు. వార్న్ కొట్టగానే ఫాక్స్ కిందపడిపోయిందని చెప్పారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చర్యలు చేపడతామని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు. గతంలో కూడా షేన్ వార్న్ తన అసభ్య ప్రవర్తనతో పరువు పోగొట్టుకున్నాడు. ఓ బ్రిటిష్ నర్సుకు అసభ్య మెసేజ్ లు పంపించిన ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయింది. ఆ సమయంలో ఆసీస్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న షేన్ వార్న్ తన పదవిని కోల్పోయాడు. వివాహేతర సంబంధాలకు సంబంధించి కూడా షేన్ వార్న్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. భర్త వైఖరితో విసిగిపోయిన వార్న్ భార్య సిమోన్ ఆయనకు దూరంగా ఉంటోంది.